ప్రజలకు దానిపై పూర్తి అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ తిరుపతిరావు కీలక సూచన

by Disha Web Desk 19 |
ప్రజలకు దానిపై పూర్తి అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ తిరుపతిరావు కీలక సూచన
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కోర్టు హాల్లో అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధ్యక్షతన జిల్లా స్థాయి కాలుష్య నియంత్రణ మండలి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం ద్వారా కలిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ ను తయారు చేసే పరిశ్రమలను తనిఖీ చేసి తయారీని పూర్తిగా నిషేధించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో, గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మాల్స్, వీధి వ్యాపారులు, పండ్లు విక్రయించే వారికి కూడా అవగాహన కల్పించి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్లాస్టిక్‌ను వాడితే వారిపై చర్యలు తీసుకోవాలని జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్లు కు జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. పాఠశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి విద్యార్దులకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా వాతావరణం కాలుష్యానికి గురవుతుందని, దాని ద్వారా మానవ మనుగడకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అధికారి కాలుష్య నియంత్రణ మండలి అధికారి మున్సిపల్ కమిషనర్లు మెంబర్ గా ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి వెంకన్న, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజలక్ష్మి, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed