- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మట్కా స్థావరాలపై పోలీసుల దాడి
దిశ,తాండూరు : తాండూరు పట్టణంలోని మట్కా స్థావరాలపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7,560 నగదుతో పాటు 6 మొబైల్స్, మట్కా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ సంతోష్ కుమార్,తెలిపిన వివరాల ప్రకారం.. పాత తాండూర్ అంబేద్కర్ పార్క్ వద్ద మట్కా నిర్వహిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు మట్కా స్థావరంపై పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులు మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మట్కా ఆడుతూ పట్టుబడిన వారిలో
సమ్మిర్, జియో దిన్, కాజా పాషా, రాజు, జగ్గప్ప, ఇలియాస్ లను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ తెలిపారు. తదుపరి మట్కా స్థావరం వద్ద అరెస్టు చేసిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీఐ మాట్లాడుతూ తాండూరు పట్టణం తో పాటు ఇతర ప్రాంతాలలో ఎవరైనా సరే మట్కా,పేకాట జూదం కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సై కాశీనాథ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.