కేసీఆర్‌కు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు: ఈటెల

by Dishafeatures2 |
కేసీఆర్‌కు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు: ఈటెల
X

దిశ, తుర్కయంజాల్ : ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటెల రాజేందర్ ప్రసంగం కార్యకర్తలను ఉర్రుతలూగించింది. సీఎం సీఎం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌ను ప్రజలు విశ్వసించే రోజులు పోయాయాన్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో ప్రజలు అసహ్యించుకునే వరకు దిగజారారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ చేస్తాను అని.. సమస్యల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారిందన్నారు.

కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని అన్నారు. కేసీఆర్ తనకు కాలం చెల్లిందని భావిస్తున్నారని.. తన ఓటమిని ఒప్పుకునే రోజులు వస్తాయని అన్నారు. ఇది ఎడ్డి తెలంగాణ కాదని.. ఇక్కడి ప్రజలు విఘ్నలని, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పి, పాతలానికి తొక్కుతారని అన్నారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని, పల్లెలను బ్రాందిల మాయంగా మార్చారన్నారు. తెలంగాణ గ్రామాల్లో 1.50 లక్షల బెల్ట్ షాపులు నడిపిస్తున్నరాని డ్యూయ్యాబేట్టారు.

రైతులను వరి వేయొద్దని అయోమయానికి గురి చేస్తున్నారని, వడ్లు కొనే దమ్ము కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర లో కెసిఆర్ ద్రోహిగా మిగలడం ఖాయం అని అన్నారు. హుజరాబాద్‌లో టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లిన, పథకల హామీలు గుప్పించిన కేసీఆర్‌కు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని, హుజురాబాద్ ఫలితమే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని పిలుపు నిచ్చారు.



Next Story

Most Viewed