- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

దిశ, పరిగి : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పరిగి డివిజన్ మన్నెగూడ నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద కాన్వాయ్ గా పరిగికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ప్రజలను అభివాదం చేశారు. అనంతరం పరిగిలోని కోడంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు తెచ్చిన గజమాలతో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సత్కరించారు. అనంతరం ఎస్ గార్డెన్స్ లో వేలాధి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మద్య ఎమ్మెల్యే దంపతులు కొప్పుల మహేశ్ రెడ్డి–ప్రతిమారెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జన్మదిన వేడుకల సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో కొప్పుల అనిల్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ కరణం అరవింద్ రావ్, ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి, వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్, నాయకులు బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మీర్ మహమూద్ అలీ, అన్వర్, బషీర్, మంగు సంతోష్ తోపాటు పరిగి, దోమ, పూడూరు, కుల్కచర్ల, చౌడాపూర్, గండేడ్ మండలాల బీఆర్ఎస్ నాయకులు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.