గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ లేకుండా చికిత్స

by Dishanational2 |
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ లేకుండా చికిత్స
X

దిశ, శేరిలింగంపల్లి : వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ ( వీఎస్ డీ) తో బాధపడుతున్న అంతర్జాతీయ శిశువుకు ఆపరేషన్ లేకుండా విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు మెడికవర్ వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను మెడికవర్ వైద్యులు వెల్లడించారు. సోమాలియాకి చెందిన ముస్తల్ఫా అబ్రిస్క్ అహ్మద్ అనే 11 నెలల పాప ఏడు కిలోల బరువుతో ఉంది. ఈ పాప గుండెలో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ ( వీఎస్ డీ ) అని పిలవబడే రంధ్రంతో బాధపడుతున్నది. పాప తల్లి దండ్రులు ఆమెని సోమాలియాతో పాటు మనదేశంలోనూ పలు హాస్పిటల్స్ లో చూపించారు. అక్కడ వారు ఈ పాపకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండె రంద్రం పూడ్చాలని సూచించారు.

అయితే మెడికవర్ హాస్పిటల్స్ లో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ సప్రె గురించి తెలుసుకొని మెడికవర్ హాస్పిటల్స్ కి రావడం జరిగింది. పాపని పరీక్షించిన డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే పాపకి కోత, గాయం లాంటివి చేస్తే అవి మనటానికి హాస్పిటల్ లో ఎక్కువ రోజులు ఉండవలసి వస్తుందని, చిన్న వయసు కాబట్టి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి అని కోత లేకుండా గుండె ప్రొసీజర్ నిర్వహించి గుండె రంద్రాన్ని పూడ్చడం జరిగిందని డాక్టర్ ఆశీష్ తెలిపారు. ఇది సాధారణ పుట్టుకతో వచ్చే గుండె సమస్య అని, చిన్న పాప కావడంతో కోత కుట్లు లేకుండా వీఎస్ డీ పరికరం అమర్చి రంద్రాన్ని పూడ్చామని వెల్లడించారు. వీఎస్ డీ డివైస్ క్లోజర్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించామని, మరుసటి రోజు డిశ్చార్జ్ చేశామన్నారు. శిశువు కోలుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉందని తెలిపారు డాక్టర్ ఆశీష్. అనంతరం సెంటర్ హెడ్ మాత ప్రసాద్ మాట్లాడుతూ.. అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యంత అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు, పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ బృందంచే అత్యాధునిక ఎన్ ఐసీయూ, పీఐసీయూ సౌకర్యాలను కలిగి ఉందన్నారు. పాప తల్లిదండ్రులు తమ బిడ్డకు కొత్త జీవితాన్ని అందించినందుకు వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed