నార్సింగి మున్సిపాలిటీ బ‌డ్జెట్ రూ. 56.57 కోట్ల‌కు కౌన్సిల్ ఆమోదం

by Kalyani |
నార్సింగి మున్సిపాలిటీ బ‌డ్జెట్ రూ. 56.57 కోట్ల‌కు కౌన్సిల్ ఆమోదం
X

దిశ‌, గండిపేట్ : నార్సింగి మున్సిపాలిటీ అభివృద్ధికి చొర‌వ‌తో ప‌ని చేయ‌డం జ‌రుగుతుంద‌ని మున్సిపాలిటీ చైర్మెన్ మైలారం నాగ‌పూర్ణ శ్రీ‌నివాస్‌, వైస్ చైర్మెన్ గోపాల విజ‌య‌బాబులు అన్నారు. మంగ‌ళ‌వారం మున్సిపాలిటీ కౌన్సిల్ స‌మావేశాన్ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు నిధుల కేటాయింపు, ఆమోద కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ చైర్మెన్, వైస్ చైర్మెన్‌లు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ప‌రిధిలో సీసీ రోడ్డు ప‌నుల‌కు రూ.13.52 కోట్లు, డ్రైనేజీ ప‌నుల‌కు రూ.8.45 కోట్లు, కమ్యూనిటీ హాల్ ప‌నులు రూ.22.12 కోట్లు, వైకుంఠ‌ధామం ప‌నుల‌కు రూ.2.62, వీధిదీపాల ప‌నుల‌కు రూ.2.55 కోట్లు, గ్రీన‌రీ ప‌నుల‌కు రూ.కోటి, బోర్ మెటీరియ‌ల్‌, పారిశుద్ధ్య కార్మికుల‌కు ప‌నిముట్లు, ఇత‌ర ప‌నులకు రూ.6.31 కోట్ల బ‌డ్జెట్‌ను నిర్దేశించుకున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు మున్సిప‌ల్ కౌన్సిల్ స‌భ్యుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొని ఆమోదించామ‌న్నారు. ఈ మొత్తం రూ.56.57 కోట్ల‌ను మున్సిపాలిటీ అభివృద్ధిని కాంక్షిస్తూ ఖర్చు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఈ న‌ర్సింహ్మ‌రాజు, మేనేజ‌ర్ యోగేష్, ఇరిగేష‌న్ డీఈ ర‌మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed