ఎస్సీ, బీసీ వర్గం యువకులకు మధ్య జరిగిన ఘటనలో.. మాజీ గ్రంథాలయ చైర్మన్ అరెస్ట్..

by Disha Web |
ఎస్సీ, బీసీ వర్గం యువకులకు మధ్య జరిగిన ఘటనలో.. మాజీ గ్రంథాలయ చైర్మన్ అరెస్ట్..
X

దిశ ప్రతినిధి వికారాబాద్: దేవనూరు గ్రామంలో ఎస్సీ వర్గం యువకులు, బీసీ వర్గం యువకులకు మధ్య జరిగిన ఘటనలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థల ఛైర్మెన్ మురళీకృష్ణ గౌడ్‌ను పోలీసులు రిమాండ్ చేశారు. దేవనూరు గ్రామానికి చెందిన బొడ్క నరందర్ అనే శివమాలలో ఉన్న యువకుడు, మెట్ల నరేష్ అనే వ్యక్తిపై యాలాల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఈ క్రమంలో కొంతమంది దేవనూరు గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన పిర్యాదు 12 గంటలు గడవక ముందే ఇతర గ్రామస్తులైన శివ స్వాములకు చెప్పి అమాయకులైన కొంత మందిని ప్రేరేపించారు. అనంతరం లక్ష్మి నారాయణపూర్ చౌరస్తాలో ధర్నా చేయించడం జరిగింది. ధర్నా వద్దకు వచ్చిన ఒక వ్యక్తి మురళి కృష్ణ గౌడ్ దేవనూరు యువకులను నేరం చేసే దిశగా ప్రేరేపించి, వాళ్లని రెచ్చగొట్టి యాలాల్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న మెట్ల నరేష్ పై దాడి చేయించాడు. ప్రాణరక్షణ కోసం యాలాల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తలదాచుకున్న వదలకుండా పోలీస్ స్టేషన్‌లోని రికార్డు రూమ్ తలుపులు బద్దలకొట్టి హత్యాయత్నం చేసిన యువకులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ కేసులో శుక్రవారం బొడ్క నరెండర్, నంద గౌడ్, అరవింద్ గౌడ్, శివకుమార్, గణేష్ లను మురళి కృష్ణ ఇంటి వద్ద నుండి అరెస్ట్ చేసి తీసుకువచ్చి విచారించగా.. ఘటనకు పూర్తిగా మురళి కృష్ణ గౌడ్ ప్రోత్సహించాడని దేవనూరు గ్రామం యువకులు తెలియజేయటంతో అదే కేసులో మురళికృష్ణ గౌడ్‌ను కూడా అరెస్ట్ చేసి తాండూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుచాడు. దీంతో ఐదుగురిని రిమాండ్ నిమిత్తం పరిగి జైలుకు పంపించడం జరిగిందని తాండూరు రూరల్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తమ ఇష్టానుసారంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని తెలిపారు.Next Story

Most Viewed