అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించేలా ప్రభుత్వ పాలన : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

by Disha Web |
అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించేలా ప్రభుత్వ పాలన : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
X

దిశ, శంషాబాద్ : తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించేలా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ లోని కాళీమాత ఆలయం వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చి ఇంతపెద్ద అద్భుతమైన అమ్మవారి దేవాలయం నిర్మించడం చాలా సంతోషం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కుల మతాలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలప్రజలకు సమన్యాయం కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం విభిన్న కులమతాలకు నిలయంగా మారిందన్నారు. అందరి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, డిసిసిబి డైరెక్టర్ బుర్కుంట సతీష్,నాయకులు నీరటీ రాజు ముదిరాజ్, శివాజీ,నీరటీ మహేష్,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story

Most Viewed