గంటసేపు మిషన్​బగీరథ ట్యాంక్​ ఓవర్​ ఫ్లో... ఇండ్లలోకి చేరిన తాగు నీరు

by Disha Web Desk 20 |
గంటసేపు మిషన్​బగీరథ ట్యాంక్​ ఓవర్​ ఫ్లో... ఇండ్లలోకి చేరిన తాగు నీరు
X

దిశ, బడంగ్​పేట్​ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్​ బగీరథను ప్రారంభించిన విషయం విధితమే. అంతేగాకుండా నీటిని పొదుపుగా వాడండి... ఆదా చేయండి అని తెలంగాణ ప్రభుత్వం ఒక వైపు చెబుతున్నా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్​పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాంకాలనీలో మత్రం వాటర్​వర్క్స్​ అధికారులు నిమ్మెకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వివరాలలోకి వెళితే జల్​పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్​కాలనీలో 18వ వార్డులో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా 24 జూన్​ 2021లో మిషన్​బగీరథ పథకం కింద 5లక్షల లీటర్ల సామర్ద్యం గల ట్యాంక్​ను ప్రారంభించారు. వాటర్​ ట్యాంక్​ను ఇండ్ల మధ్యలో కట్టడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడంతో పెచ్చులూడుతున్నాయనే విమర్షలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం గంటన్నరలో వాటర్​ ట్యాంక్​లో కృష్ణా వాటర్​ నింపి వెంటనే మోటర్​ను ఆపివేయకపోవడంతో శుక్రవారం ఉదయం అదనంగా గంట సేపు 3లక్షల లీటర్ల కృష్ణావాటర్​ నేలపాలయ్యాయి. వృధాగా పోతున్న నీటి కారణంగా పక్కనే జరుగుతున్న రెండు శుభాకార్యాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దిగువ ప్రాంతాలను కృష్ణావాటర్​ ముంచెత్తింది. పలు ఇండ్లలోకి నీళ్లు చేరడంతో నిత్యావసరసరుకులు తడిచి ముద్దయ్యాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. నెలకు రెండు సార్లు మిషన్​ బగీరథ ట్యాంక్​ నుంచి ఓవర్​ ఫ్లో అవుతున్నా సంబంధిత వాటర్​ వర్క్​ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రోజు వారి కూలీలమని, నిత్యావర సరుకులన్నీ తడిచి ముద్దయ్యాయని వెంటనే తగిన నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్​ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.


Next Story

Most Viewed