పశు వైద్య విధానంలో దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు : మంత్రి తలసాని

by Disha Web Desk 13 |
పశు వైద్య విధానంలో దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు : మంత్రి తలసాని
X

దిశ, రాజేంద్రనగర్: పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, పశు వైద్య విధానంలో దేశంలోనే తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించిందని పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సుమారు 12 కోట్ల నిధులతో నిర్మించిన నూతన పశు వైద్య కళాశాల భవనాన్ని ఆయన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నల్గొండ, వనపర్తి తో పాటు ఇతర జిల్లాలోనూ పశువైద్యం, అగ్రికల్చర్ తదితర రంగాల్లో సేవలు అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిందన్నారు. అన్నిరకాలైన వైద్య సేవలను అందించడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పశు వైద్య విధానంలో సమూల మార్పులు చేసి, పరిశోదనా ఫలాలు విద్యార్థులకు అందాలని పశు వైద్య, చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణి దేవి తో పాటు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత, డీన్ రఘునందన్,కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed