ప్రజలపై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Disha Web |
ప్రజలపై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ, శంషాబాద్ : తెలంగాణ, శంషాబాద్ ప్రజలపై మల్లన్నస్వామి ఆశీస్సులు ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నగడ్డలో ఆదివారం మల్లన్న స్వామి కళ్యాణం, గొలుసు పెంపు, బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరికి దైవచింతన ఉండాలని అన్నారు.

ఎప్పుడూ నిత్యజీవితంలో ఎంతో బిజీగా ఉండే ప్రతిఒక్కరు కాసేపైన దేవుని దర్శనం చేసుకోని, దైవసన్నిధిలో గడిపితే ఎంతో ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రజలకు పంటలు విరివిగా పండి, అందరూ సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండేలా దీవించాలని స్వామి వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు సంజయ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నాయకులు గణేష్ గుప్త, నీరటీ రాజు ముదిరాజ్, మహేందర్ రెడ్డి, కిరణ్, నగేష్ యాదవ్, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.Next Story