- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కసిరెడ్డి
రేపు జరుగబోయే సీఎం సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

దిశ, కడ్తాల్: రేపు జరుగబోయే సీఎం సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణరెడ్డి మాట్లాడుతూ...మీర్‌ఖాన్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కార్యాలయ భవన ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక నిర్ణయం అని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి నాంది పలుకుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు విస్తృతంగా పెరుగుతాయని, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యట్ట నర్సిమా, మండల అధ్యక్షులు బిచ్య నాయక్, డోకూరి ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ చేగురి వెంకటేష్, సర్పంచ్ బిక్షపతి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, లక్ష్మయ్య,బోసు రవి, భాను, కిరణ్, జహంగీర్ అలీ, చందోజీ, శ్రీకాంత్, రమేష్, మల్లయ్య, పర్వతాలు, శివ తదితరులు పాల్గొన్నారు.






