- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరన్ కోట్ ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం

దిశ, తాండూరు రూరల్ : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 9.30 నిమిషాలకు బ్యాంకు సెక్యూరిటీ గార్డు బ్యాంకు తాళాలు తీసి చూడగా ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో సెక్యూరిటీ గార్డు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బ్యాంకులో భారీగా మంటలు వ్యాపించడం చూసి వెంటనే అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఫైర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొడంగల్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిందా మరేదైనా కారణం ఉందా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే బ్యాంకులో సరైన ప్రమాణాలు లేకపోవడంతోనే ప్రమాదం సంభవించిందని మరికొందరు అనుమానిస్తున్నారు. బ్యాంకు పై భాగంలో ఇటీవల థర్మ కోల్ షీట్స్ తో పై కప్పు ఫర్నిచర్ గా ఏర్పాటు చేశారని దీని ద్వారా కూడా మంటలు అధికంగా వ్యాపించాయని పలువురు అనుమానిస్తున్నారు. పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఒక బ్యాంకుకు భద్రతా ప్రమాణాలు లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.