- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాళం వేసిన ఇల్లే టార్గెట్
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి కారుతో వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ విద్యార్థిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు.

దిశ, రాజేంద్రనగర్ : తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి కారుతో వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ విద్యార్థిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు. నిందితుడి నుంచి బంగారు, వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్ సీఐ నాగేశ్వర్ రావు ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. సీతా రాంభాగ్ అఫ్జల్ సాగర్ ప్రాంతానికి చెందిన శ్యాంసుందర్ శుక్లా కుమారుడు రిషబ్ శుక్లా (21) డిగ్రీ చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం తండ్రి చనిపోవడంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వి నగర్ లో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. తండ్రి పెంపకంలో జల్సాలకు అలవాటు పడ్డ రిషబ్ శుక్ల తండ్రి చనిపోవడంతో తన జల్సాలు తీర్చుకునేందుకు దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. 2026 మే 26న బెలీనో కారు టీజీ 07 ఏబీ 3706 నెంబరు ను అద్దెకు తీసుకున్నాడు. 27వ తేదీన ఉదయం హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరికి పాల్పడ్డాడు. మే 28న అత్తాపూర్ తేజస్వీని నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరికి పాల్పడ్డాడు. మే 31న ఉదయం హైదర్ గూడ నందనవనం అపార్ట్మెంట్ లో చోరీకి పాల్పడ్డాడు. అత్తాపూర్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుని అరెస్ట్ చేశారు. అతని నుంచి బంగారు, వెండి అబరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రిమాండ్ కు తరలించారు.






