అనంతగిరి అడవిలో చిరుత సంచారం..

by Sumithra |
అనంతగిరి అడవిలో చిరుత సంచారం..
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : గత మంగళవారం రాత్రి సమయంలో అనంతగిరి అడవిలో వికారాబాద్ నుండి తాండూర్ వెళ్లే ప్రధాన రోడ్డు పై చిరుత సంచారం చేస్తుంది అంటూ రాత్రి 10 గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం వికారాబాద్ అనంతగిరి అడవినే అని డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. వీడియోలో చూపిన ప్రాంతంగా భావిస్తున్న ప్రాంతమంతా ఫారెస్ట్ అధికారులు సిబ్బంది రాత్రి పాట్రోలింగ్ (గస్తీ) చేస్తూ ఆధారాల కోసం గాలించారు. వీడియోలో చూపిన ప్రకారం అక్కడ చిరుత సంచరించింది అనడానికి అవకాశాలు ఉన్నాయి.

కానీ పంజాగుర్తులు ( పగ్ మార్క్స్) లాంటి ప్రత్యక్ష ఆధారాలు లేవు. ప్రస్తుతం చిరుత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రజలు ఎవరూ కూడా అనంతగిరి ఫారెస్ట్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవులలో వంటరిగా వెళ్ళకూడదు. సాధారణంగా చిరుత మనుషుల పై దాడి చేయదన్నారు. కానీ చిన్న పిల్లలను అడవులలోకి పంపవద్దన్నారు. చిరుత జాడ కోసం ఫారెస్ట్ సిబ్బంది గాలిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్ ప్రకటన విడుదల చేశారు. అలాగే ఎవరికైనా చిరుత ప్రత్యక్షంగా కనపడితే వెంటనే ఈ క్రింది నంబర్ కు ఫోన్ చెయ్యాలని తెలిపారు.

ఫోన్ : 91107 89323, 77023 05789..

Next Story

Most Viewed