'క్షయవ్యాధి ప్రాణాంతకం కాదు'

by Dishanational1 |
క్షయవ్యాధి ప్రాణాంతకం కాదు
X

దిశ, తుర్కయంజాల్‌: క్షయవ్యాధి ప్రాణాంతకం కాదని, సంపూర్ణ చికిత్స, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నిర్మూలించవచ్చని డీఎంహెచ్‌వో డా. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా కామినేని మెడికల్ కాలేజీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025 వరకు టీబీ వ్యాధిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 5,620 టీబీ కేసులను గుర్తించాల్సి ఉండగా 5,089 కేసులను (90%) గుర్తించామన్నారు. జిల్లాలో 24 నిక్షే మిత్రల ద్వారా 510 మంది పేషెంట్లకి న్యూట్రిషన్ కిట్లు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో అభయ ఫౌండేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీబీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అపోలో ఫౌండేషన్, హువెల్ లైఫ్ సైన్సెస్ వంటి పలు స్వచ్చంధ సంస్థలు టీబీ పేషెంట్లకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా.అరుణ కుమారి, వైద్య అధికారులు, కామినేని మెడికల్ కాలేజీ సూపరెంటెండెంట్ డా. అంజయ్య, జిల్లా ఎన్టీఈపీ ఉద్యోగులు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed