- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జూనియర్ అసిస్టెంట్ అత్యుత్సహం.. నన్నేడబ్బులు అడుగుతావా అంటూ టోల్ సిబ్బందిపై దాడి

దిశ,శంషాబాద్ : ప్రభుత్వ ఉద్యోగిని నన్నే టోల్ డబ్బులు అడుగుతావా అంటూ టోల్ సిబ్బందిపై జూనియర్ అసిస్టెంట్ తో పాటు అతని బంధువులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు రాజేంద్ర నగర్ ఎగ్జిట్ 17 వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గచ్చిబౌలి వైపు నుండి రాజేంద్రనగర్ రావడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న హుస్సేన్ సిద్ధికి తన (AP 22 AM 2277) షిఫ్ట్ కార్ అతనితోపాటు అతని కుటుంబ సభ్యులను తీసుకుని రాజేంద్రనగర్ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తు రాజేంద్రనగర్ టోల్ గేట్ ఎగ్జిట్ 17 వద్ద దిగాడు.
అక్కడ టోల్ సిబ్బంది టోల్ డబ్బులు చెల్లించాలని చెప్పడంతో ప్రభుత్వ ఉద్యోగిని నన్నే డబ్బులు అడుగుతావా అంటూ వాగ్వివాదం చేస్తూ బూతులు తిడుతూ టోల్ సిబ్బందిపై జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి తో పాటు అతని కుటుంబ సభ్యులు విచక్షణంగా దాడి చేశారు. దీంతో టోల్ సిబ్బంది రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకుని జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి తో పాటు మరికొందరిపై 323 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.