'ప్రజా సంక్షేమమే ధ్యేయం'

by Disha Web Desk 20 |
ప్రజా సంక్షేమమే ధ్యేయం
X

దిశ, తుర్కయంజాల్‌ : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో అందరికంటే ముందున్నామని బీఆర్‌ఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధి 21వ వార్డు, 12వ వార్డులో మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. సుమారు 8 కాలనీల్లో పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం 12వ వార్డు వింటేజ్‌ హోమ్స్‌లో మరో 6 కాలనీలో ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యారు.

ప్రజల సమస్యలు విన్నవించిన కరెంట్‌, మంచినీటి సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, శివారు ప్రాంతం కావడంతో ప్రజలు ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో ఏర్పడుతున్న నూతన కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరెంట్‌, వాటర్‌, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్రనాయకులు క్యామ మల్లేశ్‌, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వేముల అమరేందర్ రెడ్డి, కొండూరు వెంకటేష్, కౌన్సిలర్లు పుల్లగుర్రం కీర్తన విజయానంద రెడ్డి, గుండా భాగ్యమ్మ ధనరాజ్, మాజీ సర్పంచ్ లు కందాడ లక్ష్మారెడ్డి, చెవుల దశరథ, సీనియర్ నాయకులు కందాల బలదేవ రెడ్డి, మర్రి సంపత్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అశ్విని, యువజన విభాగం అధ్యక్షులు కొత్తకుర్మ కార్తీక్, నాయకులు కొంతం యాదిరెడ్డి, కొల్లూరు నిరంజన్ రెడ్డి, గుండ్ల రాజిరెడ్డి, ఆర్ల కృష్ణ, మేతరి శంకర్, జొన్నాడ జగన్ రెడ్డి, కందాడ సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story