పరిగిలో భారీ గాలులు.. హైవే 163 పై విరిగిపడిన సూచిక బోర్డు.. భారీగా నిలిచిపోయిన వాహనాలు

by Disha Web Desk 11 |
పరిగిలో భారీ గాలులు.. హైవే 163 పై విరిగిపడిన సూచిక బోర్డు..  భారీగా నిలిచిపోయిన వాహనాలు
X

దిశ, పరిగి: పరిగిలో ఆదివారం రాత్రి ఈదురుగాలితో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో హైవే 163 పై సూచిక బోర్డు రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో హైవే రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు విరిగిపడిన బోర్డును అరగంట పాటు శ్రమించి కొంత పక్కకు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జేసీబీ సాయంతో జరిపి రాకపోకలకు వీలుగా రోడ్డును సరిచేశారు. పరిగి షాద్ నగర్ రోడ్డులో రాఘవపూర్ రోడ్డుపై పెద్దపెద్ద చెట్లు విరిగిపడ్డాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Next Story

Most Viewed