- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సాధికారతకు సర్కారు చేయూత
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో భాగంగా శంషాబాద్‌లో మహిళా సంఘానికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సును రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు

దిశ, శంషాబాద్ : మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో భాగంగా శంషాబాద్‌లో మహిళా సంఘానికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సును రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా టీజీఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన కేటాయించిన 400 సరికొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ బస్సును ఆయన మంగళవారం రిబ్బన్ కట్ చేసి, పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా బస్సుల కొనుగోలుకు సహకరించడం వల్ల వారికి శాశ్వత ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా బస్సుల నిర్వహణతో ఒకవైపు ఆర్టీసీ సేవలు బలోపేతం కాగా, మరోవైపు మహిళలకు నిరంతర ఆదాయ వనరు ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






