నాటు బాంబు కలకలం

by Dishaweb |
నాటు బాంబు కలకలం
X

దిశ,యాచారం: మందు గుండు పేలి మేకకు తీవ్ర గాయాలైన సంఘటన యాచారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే యాచారం మండల కేంద్రంలో గొర్రెలు , మేకలు పెంచుకోని జీవనాధారం పొందుతున్న రైతు కసరమోని మల్లేష్ ఎప్పటిలాగే తన గొర్రెలను , మేకల మందను తీసుకోని మండల కేంద్రంలోని పావురాల గుండ్లు పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమీపంలోనే ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. వెంచర్ ఏర్పాటు సమయంలో భారీ గుండ్లను , రాళ్ళను పగులగొట్టా డానికి కంప్రెసర్ సహాయంతో గతంలో రాళ్ళను పగుల గోట్టారు. కంప్రెసర్ నిర్వహాకుల నిర్లక్ష్యంతో గుండు రాళ్లను పగలకొట్టడానికి ఉపయోగించే మందు గుండును ఆ ప్రాంతంలో మరిచిపోయారు. శుక్రవారం రోజు మేకల మందలో ఓ మేక గడ్డి మేస్తు అక్కడే ఉన్న మందు గుండును కూడ నోట్లో పెట్టుకుని , నమలటం తో ఒక్కసారిగా నాటు బాంబు పేలడంతో మేక మూతి పగిలిపోయింది. తీవ్ర రక్తస్రావంతో మేక తల్లడిల్లి పోయింది. ఇది చూసిన రైతు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంచర్ నిర్వాహాకులు కంప్రెసర్ నిర్వాహాకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వీటిపైనే ఆధారపడుతున్న తనకు న్యాయం చేయాలని బాధితుడు మల్లేష్ కోరాడు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.Next Story