జీబీ బేకర్స్ బ్రిటానియా కంపెనీలో కానరాని కార్మిక చట్టాలు.. కార్మికుల కష్టాలు

by Dishafeatures2 |
జీబీ బేకర్స్ బ్రిటానియా కంపెనీలో కానరాని కార్మిక చట్టాలు.. కార్మికుల కష్టాలు
X

దిశ, చౌదరిగూడ: జీబీ బేకర్స్ బ్రిటానియా కంపెనీలో ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నప్పటికీ కంపెనీ మాత్రం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉంది. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలంలోని లాల్ పహాడ్ లో గల జీబీ బేకర్స్ బిస్కెట్ కంపెనీ యజమాన్యం కార్మికులను వేధిస్తూ 12 గంటలు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తోందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మహిళా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాత్రి సమయాల్లో కూడా మహిళలకు విధులు వేస్తూ కనీసం వారి భద్రత పట్ల ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఎన్నో ప్రమాదాలు జరిగి కార్మికులు వికలాంగులుగా మారుతున్న కంపెనీ మాత్రం కనీస కనికరం లేకుండా వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వీటికి తోడు ఇటీవలే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ వేధింపులకు లచ్చంపేట గ్రామానికి చెందిన తిరుమలేష్ (27) ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేసినా పట్టించుకోలే

తిరుమలేశ్ మృతికి కారణమై ఎండీ మల్లికార్జున్ ను అరెస్ట్ చేయాలంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి చెందిన అఖిలపక్ష నాయకు, కార్మిక సంఘం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వెంటనే పరిశ్రమ మేనేజర్ మల్లికార్జున్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కార్మిక చట్టం ప్రకారం బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కానీ ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు నిందితుని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అఖిలపక్షం నాయకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు తమ రాజకీయ స్వలాభం కోసమేనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పరిశ్రమలో కార్మిక చట్టాలు అమలు కాకున్నా అధికారులో పట్టించుకునే నాధుడే లేడని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కంపెనీలో కార్మిక చట్టాలు అమలు అయ్యే విధంగా చేసి కార్మిక హక్కులను కాపాడాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed