కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

by Kalyani |
కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
X

దిశ, శంషాబాద్ : ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు ఎగసి పడిన ఘటన మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న ఓ స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దగ్ధమై పొగలు అలుముకున్నాయి. పొగల దాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఆదివారం కావడంతో స్క్రాప్ గోడౌన్ లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన స్థలానికి చేరుకున్న మైలార్దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed