ధరణి స్పెషల్ డ్రైవ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

by Kalyani |
ధరణి స్పెషల్ డ్రైవ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి :  కలెక్టర్
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : ధరణి భూ సమస్యలపై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ధరణి స్పెషల్ డ్రైవ్ పై రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ధరణిలో ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలి అన్నారు.

మార్చి 9వ తేదీ వరకు జరిగే ధరణి స్పెషల్ డ్రైవ్ తేదీల వారీగా అధికారులు గ్రామాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్ ఉన్న ధరణి భూముల పరిష్కారానికి మండలానికి మూడు బృందాల చొప్పున అధికారులు నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో ధరణిలో ఏర్పడినటువంటి సమస్యల వల్ల వాటి పరిష్కారానికి అధికారులు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను నివృత్తం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

గ్రామాల్లో రైతులు వారి సమస్యల పరిష్కార దిశగా అధికారులకు సహకరించాలని కోరారు. జిల్లాలో స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నిక అనంతరం తదుపరి ప్రజావాణిని నిర్వహించే సమయాన్ని వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు.



Next Story

Most Viewed