వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి: షర్మిల

by Disha Web Desk 23 |
వడగండ్ల వానకు  నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి: షర్మిల
X

దిశ,మర్ పల్లి: ఇటీవల భారీగా కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సోమవారం మోమిన్ పెట్ మండల పరిధిలోని అమ్రాట్ కోర్టు, కొలుకుందే గ్రామాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునే నాథుడు లేడా అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలో కనీసం 6, ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రతి రైతు నష్టం పోయాడని అన్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటి ఇంతవరకు ఒకరు కూడా పరిశీలనకు రాలేదు అని ఎంత నష్టం జరిగినా అంచనా కూడా వేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు ఓట్లు వేయించుకోవడానికి తప్ప రైతులు ఎలా బ్రతుకుతున్నారు అని పట్టింపు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా. 1250 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా రైతులు భయపడకండి అనే భరోసా కూడా ఇప్పటికి ముఖ్యమంత్రి ఇవ్వలేదని అన్నారు.

రైతులకు రెండు వారాల్లో పంట చేతికి వచ్చే సమయంలో రైతులు ఆగమయ్యారని , అసలు తెలంగాణలో ప్రతి ఏడాది పంట నష్టం జరిగితే పట్టించుకునే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు .2018-19లో 960 కోట్ల మేర పంట నష్టం జరిగిందని అన్నారు. 2019 20లో 990 కోట్ల మేర పంట నష్టం 21 22 లో 500 కోట్ల మేర నష్టం 21 22 లో 1000 కోట్ల మేర నష్టం ఇప్పుడు 1250 కోట్ల నష్టం ప్రతి ఏడాది ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చింది లేదని ఆమె అన్నారు. వైయస్సార్ ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే పరిహారంతో పాటు బోనస్ కూడా ఇచ్చేవారని ఇప్పుడు రూపాయి కూడా ఇచ్చే దిక్కు లేదని అన్నారు. పండుగల ఉన్న వ్యవసాయాన్ని దండుగా చేశాడు కేసీఆర్ అని ,మొత్తం 30000 ఇచ్చే సబ్సిడీ పథకాలు బందు పెట్టాడని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దరిద్రపు పాలనకు 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు గౌరవంగా బతకడం లేదని అన్నారు. పంట నష్టం జరిగితే నేరుగా వచ్చి ముఖ్యమంత్రి పరిశీలన చేసింది లేదని ఆమె కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ ప్రసాద్ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed