శంషాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్న ఈ-రేసింగ్ కార్లు

by Disha Web Desk 20 |
శంషాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్న ఈ-రేసింగ్ కార్లు
X

దిశ, శంషాబాద్ : ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించడంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో బృందం కీలక పాత్ర పోషించింది. బుధవారం విమానాశ్రయంలోని కార్గో విభాగానికి 90 టన్నుల రేసింగ్ కార్ల భాగాలు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 11.50 గంటలకు రియాద్ నుండి బోయింగ్ 747-400 చార్టర్ విమానం ద్వారా ఆటో విడిభాగాలు శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి గ్లోబల్ మోటార్‌స్పోర్ట్, ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 11 జట్లు పోటీ పడుతున్నాయి.

నగరంలో ఇంతకు ముందెన్నడూ చూడని ఆల్-ఎలక్ట్రిక్ అద్భుతమైన మోటో కార్లతో ఉత్సాహాన్ని నింపనున్నాయి. ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ కోసం నిరాటంకమైన ఎయిర్ కార్గో సదుపాయాలను అందించడంలో హైదరాబాద్ విమానాశ్రయం పాత్ర పోషించడం గర్వంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన కార్గో హబ్‌గా, హైదరాబాద్ టెంపరేచర్-సెన్సిటివ్ వస్తువులు, భారీ యంత్రాలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, పశువులు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో సురక్షితంగా రవాణా చేయబడే అనేక ఇతర వస్తువుల రవాణాను నిర్వహిస్తోందన్నారు. ఈ కన్సైన్‌మెంట్ నిర్వహణ ఆటో సెక్టార్ అవసరాలను తీర్చే మా సామర్థ్యాలను తెలియజేస్తుందన్నారు. మా కార్గో సౌకర్యాల మరింత విస్తరించి, డిజిటలైజేషన్‌తో మేము వినియోగదారులకు మా సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Read more:

వాహనదారులకు బిగ్ అలర్ట్! ...ఈ నెల 7వ తేదీ నుండి ఆ రూట్లన్నీ బంద్!...హైదరాబాద్ CP సీవీ ఆనంద్ కీలక సూచన



Next Story