మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

by Dishafeatures2 |
మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
X

దిశ, కేశంపేట: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. అలాగే మండలంలని వేముల నర్వ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు ఆయన త్యాగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, మనోహర్ గౌడ్, గోపాల్, రఘు, రాఘవేందర్, చెన్నయ్య, గణేశ్, ఆకాశ్, పరమేశ్, రాములు, కుమార్, గిరి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed