- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్ : తండాలో తాగునీటి కష్టాలు కథనానికి స్పందన
దిశ, పెద్దేముల్: గత మూడు రోజులుగా ఎర్రగడ్డ తండా లో మంచినీటి సరఫరా లేక తండా బస్సులు అవస్థలు పడుతున్నారని తండాలో నీటి కష్టాలు అనే శీర్షికను దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు లోంక నర్సింలు తండాకు చేరుకునే పలు శాఖల అధికారుల సహకారంతో వ్యవసాయ బావి నుండి తండాకు మంచినీళ్ల సరఫరా చేయడానికి పలు రకాల పనుల మరమ్మత్తులు చేపట్టి ఎర్రగడ్డ తండా గిరిజనులకు మంచినీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా తండాకు మంచినీటి సరఫరా చేయడానికి సహకరించిన తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ తాండూరు ఏ బ్లాక్ అధ్యక్షుడు లోంక నర్సింలు కు, అధికారులకు తండా వాసులు దిశ పత్రిక ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లొంక నర్సింలు మాట్లాడుతూ గ్రామాలలో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు పెద్దేముల్ మండలం అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధిక నిధులు కేటాయించి గ్రామాలలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లంక నర్సింలు, స్థానిక నాయకులు జై సింగ్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.