డీజిల్‌ అక్రమ..దందా

by Disha Web Desk 11 |
డీజిల్‌ అక్రమ..దందా
X

దిశ, తాండూరు : ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా డీజిల్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు తరలిస్తున్న డీజిల్ వాహనాన్ని పోలీసులు శనివారం రాత్రి సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. కరన్ కోట్ ఎస్సై విట్టల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం నుంచి బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న వెయ్యి లీటర్ల డీజిల్ ను తాండూరు మండలం జింగుర్తి గేట్ సమీపంలో విశ్వసనీయ సమాచారంతో వాహనాన్ని తనిఖీ చేయగా సరైన పత్రాలు చూపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తమై ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి, బొలెరో డ్రైవర్ శ్రీమంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విట్టాల్ రెడ్డి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, ఇంధనం, మత్తు పదార్థాలు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Next Story

Most Viewed