బీఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి : అంజయ్య యాదవ్

by Disha Web Desk 11 |
బీఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి : అంజయ్య యాదవ్
X

దిశ, నందిగామ : బీఆర్ఎస్ తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం నందిగామ మండలం అప్పారెడ్డి గూడ. చర్లఅంత రెడ్డి గూడా వీర్లపల్లి, మామిడిపల్లి, పలు గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో గ్రామాలు రహదారులు, సీసీ రోడ్లు ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. అదేవిధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ మరెన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. మరొక సారి ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, జగన్మోహన్ రెడ్డి, మంజుల రెడ్డి, నారాయణరెడ్డి, గొల్లపల్లి అశోక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story