రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : భీం భరత్

by Kalyani |
రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : భీం భరత్
X

దిశ, షాబాద్: చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైతాబాద్, నందన్ ఖాన్ పేట్, దామరపల్లి సాయి రెడ్డి గూడా, మాచనపల్లి నాగరకుంట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీమ్ భారత్ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప మిగతా ఏ ప్రభుత్వం దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడలేదని మండిపడ్డాడు. గత తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను, కంపెనీలను తామే తెచ్చామంటు చెప్పుకుంటున్నదనీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఓర్వలేక ఇలాంటి తప్పుడు కేసులు బనాయించడం జరిగిందనీ అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు వ్యవసాయ భూమి, ఉచిత కరెంట్ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఈసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు.నా అభివృద్ధిని, విజయాన్ని ఓర్వలేకే నాపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పాడు.

అంతి రెడ్డిగూడెం గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో 200 మంది భీమ్ భరత్ ఆధ్వర్యంలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలగంటీ మధుసూదన్ రెడ్డి, షాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిలు సురేందర్ రెడ్డి, రామిరెడ్డి , సీనియర్ నాయకుడు తమ్మలి రవీందర్, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, మహేందర్ గౌడ్, పర్వతాలు, అంతి రెడ్డిగూడెం గ్రామస్తులు, మద్దూరు సర్పంచ్ నరేందర్ రెడ్డి, నేరెట్ల మహేందర్, గౌరీశ్వర్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు..

Next Story