జంగారెడ్డిపల్లి లో ఇసుక ఫిల్టర్స్ ధ్వంసం

by Dishaweb |
జంగారెడ్డిపల్లి లో ఇసుక ఫిల్టర్స్ ధ్వంసం
X

దిశ ,తలకొండపల్లి : మండలంలోని జంగారెడ్డి పల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక ఫిల్టర్ నడుపుతున్న మూడు డప్పుల పైశనివారం తలకొండపల్లి రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి ధ్వంసం చేశారు. శుక్రవారం చుక్కపూర్ ఎడవెల్లి చెన్నారం గ్రామాలలో దాడులు నిర్వహించిన సమయంలో మండలంలో పలు గ్రామాలలో అక్రమ ఇసుక డబ్బులు కొనసాగుతున్న కేవలం ఈ గ్రామాలపైన్న అధికారులు ఎందుకు మక్కువ చూపుతున్నారని దిశ ప్రశ్నించింది. దిశ కథనానికి స్పందించిన తలకొండపల్లి తహసిల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో శనివారం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఆర్ఐ మంజులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. మరికొన్ని గ్రామాల్లో కూడా అక్రమ ఇసుక ఫిల్టర్స్ కొనసాగుతున్నట్టు మా దృష్టికి వచ్చిందని వాటిపై కూడా త్వరలో దాడులు కొనసాగుతాయని తహసిల్దార్ హెచ్చరించారు.ఆయా గ్రామాల్లో అక్రమ ఇసుక ఫిల్టర్స్ నడిపించే వారి కోసం రెవెన్యూ అధికారులు ప్రత్యేకమైన హెచ్చరిక అనే ఫ్లెక్సీలను కూడా సిద్ధం చేశారు. ఇసుక ఫిల్టర్సు నిర్వహించిన, అక్రమ ఇసుక ఎవరి పొలంలోనైనా నిలువచేసిన ఆట్టి పొలం పట్టదారులపై ఇకముందు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పలు సూచనలతో కూడిన ఫ్లెక్సీలను సిద్ధం చేశారు. సోమవారం నుండి అక్రమ ఇసుక తయారు చేసే గ్రామాల్లో హెచ్చరిక ఫ్లెక్సీలు గ్రామ పంచాయతీల వద్ద ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మంజుల, పోలీసు అధికారులు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Next Story