అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి.. ఎమ్మెల్యే

by Sumithra |
అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి.. ఎమ్మెల్యే
X

దిశ, ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద ప్రజలకు అందేలా చూడాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆమనగల్లు మున్సిపల్ కేంద్రంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కేంద్రంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల పై సమీక్ష నిర్వహించారు. వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా కరెంటు కోతలు లేకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచిన నాలుగు కొత్త పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ లలిత, ఎంపీడీవో కుసుమ మాధురి, ఆర్ అండ్ బి డీఈ రవీందర్, మున్సిపాలిటీ కమిషనర్ శంకర్, విద్యుత్ డి ఈ బాలకృష్ణ, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి..

రాబోయే జిల్లా, మండల పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి సూచించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని సూచించారు. ప్రతి నాయకుడికి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు వస్పూల శ్రీశైలం, కండె రంగయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ, మండల అధ్యక్షులు జగన్, జిల్లా నాయకులు గుర్రం కేశవులు, నాయకులు కృష్ణ నాయక్, బాబా, ఇమ్రాన్, మానయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed