111 జీవోకు తూట్లు.. నానాజీపూర్‌లో వివాదాస్పద స్కూల్

by Naga Rani Yarlagadda |

మండలంలోని నానాజీపూర్ గ్రామ పరిధిలో 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఓ కార్పొరేట్ విద్యాసంస్థ భారీ భవన నిర్మాణాన్ని చేపట్టింది.

111 జీవోకు తూట్లు.. నానాజీపూర్‌లో వివాదాస్పద స్కూల్
X

దిశ, శంషాబాద్: మండలంలోని నానాజీపూర్ గ్రామ పరిధిలో 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఓ కార్పొరేట్ విద్యాసంస్థ భారీ భవన నిర్మాణాన్ని చేపట్టింది. నిబంధనలపై నీళ్లుచల్లి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. సుమారు ఏడాదిగా నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతున్నప్పటికీ పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అన్ని విధాలుగా అక్రమార్కులకు సహకరించినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి జోత్స్న అక్రమ నిర్మాణం పూర్తి చేసే విషయంలో అన్ని విధాలుగా సహకరించారు. అక్రమ నిర్మాణం విషయం మొదటి నుంచి తెలిసినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా జీవో 111 నిబంధనల ఉల్లంఘనపై మండల పంచాయతీ అధికారులకు సమాచారం ఉన్నా కూడా పట్టించుకోలేదు.

కొన్ని ఎకరాల్లో నిర్మాణం

నానాజీపూర్ గ్రామ పరిధిలో సుమారు 5 ఎకరాల స్థలంలో కార్పొరేట్ విద్యా సంస్థ తమ బడిని ప్రారంభించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా సుమారు 50 గదులకు పైగా కొన్ని అంతస్తుల్లో నిర్మాణ పనులు చేపట్టారు. ఏడాదిగా ఈ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధితో కార్పొరేట్ పాఠశాలను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

నిబంధనలపై నీళ్లు

111 జీవో పరిధిలో నిర్మాణాలకు కఠిన నిబంధనలు అమల్లో ఉండ గా, అంత పెద్ద స్థాయిలో భవన నిర్మాణం జరుగుతున్నా సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రా మస్తులు, ప్రజాప్రతినిధులు ఈ వ్య వహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధి కారి (డీపీవో) ప్రత్యేక దృష్టి సారిం చి, నానాజీపూర్‌లో జరుగుతున్న నిర్మాణ పనులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార యం త్రాంగం నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడి చే చర్యలు కొనసాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలి.

మూడుసార్లు నోటీసులు

నిర్మాణ పనులకు సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు మూడు సార్లు నామమాత్రంగా నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా వ్యవహారాన్ని వదిలేశారని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేవలం తూతూ మంత్రంగానే నోటీసులు మిగిలిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తుత్తి నోటీసులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థకు సంబంధించి భారీ నిర్మాణం వెనుకాల పంచాయతీ అధికారులకు భారీ మొత్తంలో నగదు ముట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కూలగొడతామని..

ఏడాదిగా ఉత్తుత్తి నోటీసులు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి జ్యోత్స్న అనుమతులు లేకుం డా నిర్మించిన పాఠశాల భవ నాన్ని కూల్చివేస్తామని బీరా లు పలకడం గమనార్హం. పం చాయతీ కార్యదర్శి పూర్తి సహకారంతోనే పాఠశాల భారీ భవన నిర్మాణం పూర్తయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Next Story