డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : కలెక్టర్

by Kalyani |
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : కలెక్టర్
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో రెండు పడకల గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు జిల్లాలో 851 ఇండ్లు పూర్తి అయినవని, మిగతా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తే పేదవారికి ఇండ్లు అందుబాటులోకి వస్తాయని, ఇండ్లకు నివాసయోగ్యంగా ఉండేందుకు అవసరమైన వాటర్ సప్లై, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గం వారీగా ఎక్కడ ఏఏ పనులు పూర్తి అయ్యాయి, ఇంకా ఎన్ని పురోగతిలో ఉన్నవి, పూర్తి కావలసినవి ఇంకా ఎన్ని ఉన్నాయని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్ల పనులను వివిధ శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుదీర్, డిఆర్డిఎ శ్రీనివాస్, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ కృష్ణయ్య, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, ఆర్.డబ్ల్యుఎస్ ఈఈ శ్రవణ్ ప్రకాష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story