చేవెళ్ల పార్లమెంట్ పహారాలో కాంగ్రెస్ విజయం తథ్యం : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 23 |
చేవెళ్ల పార్లమెంట్ పహారాలో కాంగ్రెస్ విజయం తథ్యం :  రంజిత్ రెడ్డి
X

దిశ,కుల్కచర్ల : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి అన్నారు.బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో మండల కార్నర్ మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలే చేవెళ్ల పార్లమెంట్ పహార లో విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. అంగట్లోకి కొత్తగా మారువేషం వేసుకొని మతాలను విభజిస్తూ ఓట్లు అడిగే పార్టీనీ నమ్మే పరిస్థితిలో చేవెళ్ల ప్రజలు లేరని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్య హరిచంద్ర, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ కనకం మొగలయ్య, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, స్థానిక ఎంపీటీసీ ఆనందం, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed