ఆరు గ్యారెంటీ కార్డు‌తో ఇంటింటికి ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు

by Aamani |
ఆరు గ్యారెంటీ కార్డు‌తో ఇంటింటికి ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు
X

దిశ, మీర్ పేట్: మహేశ్వరం నియోజకవర్గం, మీర్ కార్పొరేషన్ పరిధిలో తుక్కుగూడ విజయ భేరి సభ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ అబ్జర్వర్, మాజీ కేంద్రమంత్రి, ఏఐసీసీ మెంబర్ దీపా దాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్పొరేషన్ పరిధిలో నీ కమలా నగర్,దాసరి నారాయణ కాలనీ లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. అనంతరం మందమల్లమ్మ చౌరస్తా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీపా దాస్ మున్షి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతి పాలన చేస్తుందని, కుటుంబంలో మూడు మంత్రి పదవులతో కేసీఆర్ కుటుంబ రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని, ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కెసిఆర్ బాయ్ బాయ్ అని చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిన్నటి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఆమె వివరించారు.

అనంతరం చల్లా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన తల్లి సోనియాగాంధీకి తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు సోనియాగాంధీని ఎప్పటికీ మర్చిపోరని ఆయన తెలిపారు. కెసిఆర్ తెలంగాణ వస్తే నిధులు, నియామకాలు, నీళ్లు, మనకే వస్తాయని ప్రగల్భాలు పలికాడని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటే తల్లి సోనియమ్మ చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నన్నారు. ఆదివారం తుక్కుగూడ లో జరిగిన విజయభేరి సభకు దేశ నలుమూలల నుంచి సిడబ్ల్యుసి నాయకులు వచ్చారని ఈ సభ భారతదేశ చరిత్ర పుట్టల్లలోకి ఎక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అబద్దాల ప్రభుత్వ నడుస్తుందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని ఆయన గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మన బ్రతుకులు మారుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఆదివారం రోజు తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభను విజయవంతం చేసిన రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ప్రజా ప్రతినిధుల కు నాయకులకు, కార్యకర్తలకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విజయ భేరి సభకు మహేశ్వరం నియోజకవర్గం నుండి సుమారు 40 వేల మంది విజయ భేరి సభకు తరలి వెళ్లారని, కాంగ్రెస్ అభిమానులు భారీగా సభను విజయవంతం చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. సందర్భంగా ఆరు గ్యారెంటీ ల పథకాల పోస్టర్ ను నాయకులతో కలిసి చల్లా ఆవిష్కరించారు. జిల్లా,మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఇంఛార్జి జోష్ణ శివారెడ్డి బడంగ్ పేట్ నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి, మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి, వై అమరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దేవగోని కృష్ణ ,జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్, సిద్దాల శ్రీశైలం,కార్పొరేషన్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పందుల వెంకటేష్ గౌడ్, కీసర యాదిరెడ్డి, నిమ్మల వెంకటేష్ గౌడ్, మహిళా నాయకురాలు గంగమ్మ, కాంగ్రెస్ నాయకులు భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పరుశురాం, కాట్ల యాదయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed