- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫైర్..

దిశ, బడంగ్పేట్ : మహేశ్వరంలో మళ్ళీగెలుపు కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని, ఈ సారి సబిత గెలవడం అసాధ్యమని, ఇది వైఎస్ ఆర్ అడ్డ కాంగ్రెస్ గడ్డ అని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. చిగిరింత పారిజాత నర్సింహారెడ్డికి మేయర్ పదవి భిక్షం వేశారని బీఆర్ఎస్ నాయకులతో మంత్రి సబిత మాట్లాడిస్తుందని, ముందుగా మంత్రి సబితాఇంద్రారెడ్డి రాజీనామ చేయాలని సవాల్ విసిరారు. నువ్వు రాజీనామ చేసిన వెంటనే మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిని కూడా రాజీనామ చేయించి 24గంటల్లో మేయర్ పీఠంపై కూర్చోబెడుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఆదివారం బడంగ్ పేట్ లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్ల గూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, బండారి మనోహర్, మహిళా నాయకురాలు అమృతనాయుడులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగేటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. మూడు సంవత్సరాలలో బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లను కలుపుకుని అభివృద్ది పధంలోకి ముందుకెళ్ళిందన్నారు. బడంగ్పేట్ మేయర్ పీఠం అధికార పార్టీ దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిని బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని మేయర్ చేశారన్నారు. మేయర్ పదవి పోయినా సరేనని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి వచ్చిందని, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు పై గెలిచి మంత్రి పదవి కోసం అడ్డదారినా బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన మీరు మహేశ్వరంలో మీరు చేసిన అభివృద్ధి కి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలవలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన విషయాన్ని మరువద్దన్నారు. అభివృద్ది చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని, మహేశ్వరం నియోజకవర్గంలో శిలాఫలకాలను చూస్తేనే లోకల్ ఫండ్స్‌తో జరిగిందని అర్థమవుతుందని, బడంగ్పేట్ కార్పొరేషన్లో కోట్ల రూపాయలతో అభివృద్ది చేశామని చెప్పుకుంటున్నారని, ఎక్కడ ఏమి అభివృద్ది చేసినవో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ మంత్రిగా ఇప్పటి వరకు చాలామర్యాద ఇచ్చాం.. నీ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టుకో ? నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఊరుకోరని హెచ్చరించారు.
తీగల హయాంలోనే అభివృద్ది ...
తీగల కృష్ణారెడ్డి నాయకత్వాన్ని కోల్పోయామని, అభివృద్ది అంటే తీగల హయాంలోనే జరిగిందన్నారు. తీగలను కాదని నిన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని, రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారన్నారు. చెరువుల సుందరీకరణ ముఖ్యమా ? ఇంటి పన్నులు ముఖ్యమా అని ప్రశ్నించారు? సుందరీకరణ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దోచి పెడుతున్నావని ఆరోపించారు. చిత్తశుద్ది ఉంటే వెంటనే పెంచిన ఇంటి పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.