దివ్యాంగుడిని గౌరవించిన కలెక్టర్ నారాయణరెడ్డి..

by Disha Web Desk 20 |
దివ్యాంగుడిని గౌరవించిన కలెక్టర్ నారాయణరెడ్డి..
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనే మాటను నిజం చేశాడు వికారాబాద్ జిల్లాకు నూతనంగా నియామకం అయిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి. శుక్రవారం కొత్తగా వచ్చిన కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకంక్షలు తెలపడానికి రెగ్యులర్ కంప్యూటర్ ఆపరేటర్లు వెళ్లారు. వారు కలెక్టర్ కు తమను పరిచయం చేసుకొని ఒక ఫోటో దిగాలని కోరారు.

దానికి సరేనని ఫోటో దిగడానికి కుర్చీలో నుండి పైకి లేవగానే ఒక ఆపరేటర్ వికలాంగుడని గుర్తించిన కలెక్టర్, తన కుర్చీ పైన కూర్చోకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి మోకాళ్లపై కూర్చుని మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం తీసుకున్నారు. ఈ ఫోటో జిల్లాలోని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ కలెక్టర్ ను చూస్తే మంచివాడిలా ఉన్నాడు, సామాన్యుడికి అందుబాటులో ఉంటాను అని చెప్పకనే చెప్పాడు అంటూ కలెక్టర్ నారాయణరెడ్డిపై జిల్లా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.



Next Story

Most Viewed