- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పట్నం పకోడీలో బొద్దింక కలకలం..

దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని మంచాల్ రోడ్డులో ఉన్న వైన్స్ పక్కన గల పాయల్ స్వీట్ హౌస్ & బేకరీలో జెర్కొని జగన్ అనే వ్యక్తి పకోడీలు కొనుగోలు చేశాడు. అందులో పెద్ద సైజు లో చనిపోయిన బొద్దింకలు ఉండడాన్ని గమనించిన ఆయన ఒక్కసారిగా షాక్ కు గురై స్వీట్ షాప్ యజమాని రాజు ను ఇదేమిటని ప్రశ్నించగా అతను పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కలుషితమైన ఆహారాలు అమ్మడం, హోటల్లో సైతం పురుగులతో కూడిన పదార్థాలు కస్టమర్లకు అందించడం... నిత్యకృత్యం అయిపోయిందని అన్నారు. 15 రోజుల క్రితం మెగా డీమార్ట్ లో పిండిలో పురుగులు... ఇబ్రహీంపట్నం చౌరస్తా లోని శ్రీ రాఘవేంద్ర హోటల్లో దోశలో బోద్దింకలు ఇందుకు ప్రత్యేక్ష సాక్షాలు అని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సదరు షాపు హోటల్ యజమానులపై వెంటనే సంబంధిత ఫుడ్ సేఫ్టీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు జెర్కొని జగన్ పేర్కొన్నారు.