శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ

by Disha Web Desk 20 |
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ
X

దిశ, శంషాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ నుండి విదేశాలకు విదేశీ కరెన్సీ తరలిస్తూ సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం యూనెస్ మహ్మద్ అనే ప్రయాణికుడు శనివారం శంషాబాద్ విమానాశ్రయం నుండి (6E-1405) ఇండిగో విమానంలో షార్జా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు.

శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అతనిపై అనుమానం వచ్చి అతని బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగులో సౌదీ అరేబియా రియల్ 200 × 500 నోట్లు 21 లక్షల 93 వేల 540 రూపాయలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి దానిపై బట్టలను కప్పి ఉండడాన్ని గమనించారు. దాంతో సీఐఎస్ఎఫ్ అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం విదేశీ కరెన్సీని తరలిస్తున్న ప్రయాణికుని సీఐఎస్ఎఫ్ అధికారులకు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.



Next Story

Most Viewed