- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నోవాటెల్ కు సీఎం రేవంత్ రెడ్డి

దిశ, శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవోటేల్లో ప్రారంభం కానున్న సీఎల్పీ సమావేశానికి ముందుగానే మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అనంతరం నోవోటేల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి సన్మానించారు. పలు అంశాల పై సీఎల్పీ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, ఇందిరమ్మ, ఇండ్లు సన్న బియ్యం పథకం, ఎస్సీ వర్గీకరణల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు చర్చించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతంగా ఉగాదినాడు సన్నబియ్యం పథకం ప్రారంభించారన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి డీలర్ ద్వారా ప్రతి పేదవాడికి అర్హులైన అందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. ఈ పథకంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాని పై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఎంతో మంది పేద రైతులకు నష్టం కలిగిందని దానిని దృష్టిలో ఉంచుకొని భూభారతిని తీసుకువచ్చి ప్రతి రైతుకు మేలు కలిగే విధంగా ప్రారంభించామన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ గృహ పథకం ద్వారా ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. ఈ నాలుగు అంశాల పై సవివరంగా ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు.