కాంగ్రెస్ ఓటర్లపై కేంద్రం కక్ష్య

by Taduka Kalyani |

కాంగ్రెస్ పార్టీ ఓటర్లను తొలగించేందుకు కేంద్రం కక్ష్య కట్టుకుందని సర్‌ (స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్‌) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ ఓటర్లపై కేంద్రం కక్ష్య
X

దిశ, తాండూరు: కాంగ్రెస్ పార్టీ ఓటర్లను తొలగించేందుకు కేంద్రం కక్ష్య కట్టుకుందని సర్‌ (స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్‌) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్‌ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు పర్యవేక్షణలో తాండూరు నియోజకవర్గ స్థాయి సర్‌ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీ.రామ్మోహన్ రావు తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) చైర్మన్‌గా దూడం వెంకట రమణ, వికారాబాద్‌ జిల్లా డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ టీ. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమీషన్ ముసుగులో అర్హులను ఓటర్లను తొలగించేందుకు సర్‌ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓటర్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని అన్నారు. ఈ కుట్రలను అడ్డుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలపై ఉందని అన్నారు. సర్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా పని చేయాలన్నారు. బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంగా పనిచేయాలన్నారు. కొత్తగా ఓటర్ల నమోదును కూడా చేపట్టాలన్నారు. ఇంటింటి సర్వేలో పాల్గొనాలని, నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రాజ్యాంగ బద్దంగా వచ్చిన నిజమైన ఓటు హక్కును తొలగించేందుకు అధికారం లేదని అన్నారు. సర్‌ కార్యక్రమం ద్వారా ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.
అర్హులను ఓటర్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని అన్నారు. కొత్త ఓటర్ల నమోదు, డబుల్‌ ఓటర్ల తొలగింపుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు పనిచేయాలని అన్నారు. ఈనెల 25 నుంచి వచ్చేనెల జులై 24వ తేది వరకు బీఎల్‌ఓలతో పాటు బీఎల్‌ఏలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేయాలన్నారు. మరోవైపు సర్‌ శిక్షణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూడం వెంకట రమణ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించి.. సర్‌ కార్యక్రమంపై సమగ్ర అవగాహన కల్పించారు. తాండూరులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి బీఎల్‌ఏలు, నేతలు హాజరు కావడంతో కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, మాజీ చైర్ పర్సన్ స్వప్న, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు ఉత్తమ్ చంద్, గాజీపూర్ నారాయణ రెడ్డి, నర్సిరెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మండలాల అధ్యక్షులు రాజ్ కుమార్, మహిపాల్ రెడ్డి, మహిపాల్, రాజవర్దన్ రెడ్డి, నాయకులు అఫ్పూ(నయూం), ప్రభాకర్ గౌడ్, వడ్డె శ్రీనివాస్, సర్దార్ ఖాన్, లింగదలి రవికుమార్, మహిళ నాయకులు శోభారాణి, గాజుల మాదవి, కౌన్సిలర్లు, వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story