మాజీ గవర్నర్​ కొడుకు, మనువడు పై కేసులు నమోదు

by Disha Web Desk 7 |
మాజీ గవర్నర్​ కొడుకు, మనువడు పై కేసులు నమోదు
X

దిశ, బడంగ్​పేట్​: మామిడిపల్లిగ్రామంలో స్థల విషయంలో జరిగిన ఘర్షణలో కిరాయిగుండాలచే దాడులు చేయించిన మాజీ గవర్నర్ కుమారుడు, మనువడులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రాళ్ళదాడులతో పాటు బైక్‌లను దగ్దం చేసిన 14మంది కిరాయి గుండాలను పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు. పహాడిషరీఫ్​ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 324లోని 14గుంటల ప్రయివేట్​స్థలం.. దారి విషయంలో మాజీ గవర్నర్​పి.శివశంకర్​కుమారుడు డాక్టర్​ వినయ్​కుమార్​వర్గం, మామిడి పల్లి గ్రామానికి చెందిన సతీష్​గౌడ్ వర్గంల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే మాజీ గవర్నర్ కుమారుడు పి.శివశంకర్​ కుమారుడు డాక్టర్ వినయ్​కుమార్,​తన కుమారుడు పుంజాల శాశ్వత్‌లు పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన కిరాయి గుండాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం డాక్టర్​వినయ్​కుమార్, శాశ్వత్‌లు సన్​సిటికి చెందిన ఫరాన్​షఫీ రుకాదియా (40), బండ్లగూడకు చెందిన ఇమ్రాన్​ఖాన్​(24), చార్మినార్‌కు చెందిన మొహమ్మద్​జుబేర్​(25), లంగర్​హౌజ్‌కు చెందిన మాదుగని మహేష్​(26), బహదూర్​పురాకు చెందిన షేక్​జమీల్​( 30), శాస్త్రి పురంకు చెందిన మొహహ్మద్​అబ్దుల్​ఫహద్​(27), బహదూర్​పురాకు చెందిన మొహమ్మద్​సిమ్​(26), వట్టేపల్లికి చెందిన మొహహ్మద్​ఆలీ (36), షాహిన్​నగర్‌కు చెందిన షేక్​హైదర్​(23), ఖాద్రిచమాన్‌కు చెందిన మొహమ్మద్​ఆలీ ఉద్దీన్​(35), ఫలక్​నుమాకు చెందిన రహమతుల్లాఖాన్​(37), హఫీజ్​నగర్‌కు చెందిన షేక్ ముజామిల్​ఉద్దీన్ (20), సాదత్​నగర్‌కు చెందిన మొహమ్మద్ ఖాళీద్​(30), షాహిన్​నగర్‌కు చెందిన మొహమ్మద్​ సాజిద్ (27) లతో కలిసి మామిడి పల్లిలోని ఆ వివాదస్పద స్థలానికి చేరుకున్నారు.

ఈ విషయం తెలసుకున్న మామిడిపల్లి గ్రామానికి చెందిన సతీష్​గౌడ్​వర్గం అక్కడికి చేరుకుంది. దీంతో డాక్టర్​ వినయ్​కుమార్ తరపున వచ్చిన కిరాయి గుండాలు మొదట సతీష్​గౌడ్ వర్గంపై రాళ్లదాడులు చేశారు. ఆగ్రహించిన సతీష్​గౌడ్​వర్గం కూడా పరస్పర రాళ్ళ దాడులకు పూనుకున్నాయి. అల్లరి మూకల దాడిలో రెండు బైక్‌లు అగ్నికి ఆహుతి అవ్వగా మరి కొన్ని బైక్‌లు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పహాడిషరీఫ్​పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దాడులకు పాల్పడ్డ 14 మందిని అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తలరించారు. పరారీలో ఉన్న డాక్టర్ వినయ్​కుమార్, శాశ్వత్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును పహాడిషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed