నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధం

by Kalyani |
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధం
X

దిశ, గండిపేట్: నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధం అయిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై మారుతి ఎర్టిగా కారులో నుంచి కుటుంబ సభ్యులను దించివేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధం అయింది. కారు కొనుగోలు చేసి 45 రోజులు మాత్రమే అయినట్లు డ్రైవర్ తెలిపారు. కుటుంబ సమేతంగా శుభకార్యానికి గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదిగా శంషాబాద్ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Next Story