బస్టాండ్ లేక ప్రయాణికుల ఇక్కట్లు..

by Sumithra |
బస్టాండ్ లేక ప్రయాణికుల ఇక్కట్లు..
X

దిశ, మాడ్గుల : మాడ్గుల మండలంలోనే అతి పెద్ద గ్రామం, 15 గ్రామాలు, ఆరు తండాలకు ముఖ్య కూడలి అయిన ఇర్విన్ గ్రామంలో బస్టాండ్ లేక దుకాణ సముదాయాల వద్ద బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రామం నుండి నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాలకు, కల్వకుర్తి పట్టణం, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, హైదరాబాద్ కు రోజుకు వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణం సాగిస్తుంటారు. బస్టాండు లేకపోవడం, కనీస అవసరాలైన మూత్రశాలలు, తాగునీటి వసతి లేకపోవడంతో గంటల కొద్ది చెట్ల కింద నిరీక్షిస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోనే రెండవ భద్రాచలం గా పేరుగాంచిన సిరిసనగండ్ల దేవాలయ జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ గ్రామం నుండి ప్రయాణిస్తారు. వచ్చే జాతర నాటికైనా గ్రామంలో బస్టాండ్ ను నిర్మించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు, గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Next Story