ప్రభుత్వాన్ని పడగొట్టడమే బీజేపీ లక్ష్యం : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Disha Web |
ప్రభుత్వాన్ని పడగొట్టడమే బీజేపీ లక్ష్యం  : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, బడంగ్​పేట్ : మునుగోడు ఎన్నికల అనంతరం ఓటమిని జీర్ణించుకోలేక తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి, టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం బడంగ్​పేట్​లో పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్​హాల్​లో బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహేశ్వరం నియోజకవర్గం టీఆర్​ఎస్​ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి హోదాలో వచ్చిన మోదీ కేవలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా తెలంగాణపై విషం కక్కారే తప్పా, రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ది చేస్తామన్న అంశాన్ని మచ్చుకైనా మాట్లాడకుండానే నిష్క్రమించిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆదాయంతో సీఎం కేసీఆర్​ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నసందర్భంలో ఈర్ష్యా ద్వేషంతోనే కేసీఆర్​ కుటుంబం, టీఆర్​ఎస్​ నాయకులపై ఈడి, ఐటి, సీబీఐ సంస్థలతో కక్షపూరితమైన దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఏదో కార్యక్రమం చేస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్రం పై మాత్రం వివక్ష చూపెడుతుందన్నారు. అలాగే దేశమంతటా విద్యాసంస్థలు ఇస్తూ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మొండి చెయ్యి చూపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ఏకంగా భగవంతున్ని రాజకీయాలలోకి లాక్కొచ్చి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ను గాని, టీఆర్​ఎస్​ పార్టీని గాని విమర్షిస్తున్నప్పుడు ఆ పార్టీ నాయకుడుగా, కార్యకర్తగా గొంతెత్తి మాట్లాడకపోతే అది మనకు నష్టం కలుగుతుందన్నారు. ​ వచ్చే మహిళా మీటింగ్​లో పార్టీకి సంబంధం లేకుండా మహిళలను పిలువకుండా సొంత పార్టీ వారే ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ పార్టీ బలోపేతానికి, కేసీఆర్​ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా కృషిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి , కొత్త మనోహర్ రెడ్డి , మీర్​పేట్​ కార్పొరేషన్​ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ కప్పాటి పాండురంగారెడ్డి, అరవింద్ శర్మ, బడంపేట్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, మీర్​పేట్​ మున్సిపల్ కార్పొరేషన్ అర్కలా కామేష్ రెడ్డి, ఆర్.కె.పురం డివిజన్ అధ్యక్షులు నాగేష్, సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు మహేందర్ యాదవ్, జల్​పల్లి అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు లక్ష్మయ్య , మహేశ్వరం మండల అధ్యక్షులు శీను నాయక్, కందుకూరు మండల అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్, కార్పొరేటర్​లు పెద్ద బావి శోభా ఆనంద్​రెడ్డి, సూర్ణ కంటి అర్జున్​, లిక్కి మమతాకృష్ణారెడ్డి, పెద్దబావి శ్రీనివాస్​రెడ్డి, సంరెడ్డి స్వప్నా వెంకట్​ రెడ్డి, భీమీడి స్వప్నా జంగారెడ్డి, కౌన్సిలర్​ లక్ష్మీనారాయణ, నాయకులు యంజాల జనార్థన్​, సాంబ శివ, వాసు బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed