జల్‌పల్లి టూ చైనా.. అధికారుల రైడ్‌లో వెలుగులోకి సంచలన విషయాలు

by Disha Web Desk 19 |
జల్‌పల్లి టూ చైనా.. అధికారుల రైడ్‌లో వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, బడంగ్​పేట్:​ జల్​పల్లి మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న కోల్డ్​స్టోరేజ్​కేంద్రాలపైమున్సిపాలిటీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. జల్​పల్లి మున్సిపాలిటీ కమిషనర్​జిపి కుమార్​బృందం వివిధ శాఖల అధికారులతో కోల్డ్​స్టోరేజ్​కేంద్రాలపై నిర్వహించిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, వెటర్నరీ సర్టిఫికెట్, ఫైర్ ఎన్వోసీ, ఎక్స్ ఫోర్ట్ సర్టిఫికెట్, సెంట్రల్ ఎక్సైజ్ సర్టిఫికెట్, కన్ స్ట్రక్షన్ సర్టిఫికెట్ తదితర ఎలాంటి అనుమతులు లేకుండా పశువుల మాంసంతో పాటు విడి భాగాలను చైనా, బంగ్లాదేశ్, అరబ్​దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు.

భారతదేశం నుంచి చైనాకు ఎగుమతులు.. దిగుమతులు నిషేదించినా అక్రమమార్గంలో పశుమాంసాన్ని ట్రక్కులు.. ఏసీ కంటెయినర్‌లు.. బోట్‌ల ద్వారా జల్​పల్లి మున్సిపాలిటీ నుంచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ రోజు ప్యాకింగ్​చేసిన మాంసాన్ని నెల రోజుల తర్వాత తేదీని ముద్రించి విదేశాలకు తరలిస్తున్నట్లు కనుగొన్నారు. ఇప్పటి వరకు జల్​పల్లి మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 12 కోల్డ్​స్టోరేజ్‌లను సీజ్​చేశారు. కోల్డ్​స్టోరేజ్​నడుపుతున్న బడాబాబులు పరారీలో ఉండగా.. నలుగురు వ్యక్తులను బాలాపూర్​ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed