ప్రజలను కాపాడ లేని వాడు పోలీస్ అధికారి కాడు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

by Disha Web Desk 20 |
ప్రజలను కాపాడ లేని వాడు పోలీస్ అధికారి కాడు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : పోలీసులను కొట్టే స్థాయికి బీఆర్ఎస్ నాయకులు వస్తే, పడే స్థాయిలో పోలీసులు ఉంటే జిల్లాలో చట్టాన్ని కాపాడేది ఎవరు..? వికారాబాద్ జిల్లా చేతగాని పోలీస్ యంత్రాంగం ఉంది. జిల్లా పోలీసులకు డ్యూటీ చేసే అర్హత లేదని, వెళ్లి ఇంట్లో కూర్చోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాండూర్ పట్టణానికి చేరుకున్న బండి సంజయ్ గత సోమవారం రాత్రి తాండూర్ బీజేపీ నాయకుడు, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఇంటిమీద దాడిని ఖండిస్తూ, వారి కుటుంబ సభ్యులను, చిన్నారులను పరామర్శించాడు.

అనంతరం మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ చిన్న పిల్లలు, మహిళలు అనికూడా చూడకుండా బీఆర్ఎస్ గుండాలు మద్యం, డ్రగ్స్ మైకంలో విచాక్షణరహితంగా దాడిచేయడం, కుటుంబం మొత్తాన్ని చంపాలని చూసిన నీచమైన చర్యను తెలంగాణ మొత్తం చూసింది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం. అది కేవలం బుద్ది జ్ఞానం తెలివి ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ఫాల్తూ రాజకీయాలు చేసే వాడికి తెలువదు.

నేను తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అయిన తర్వాత క్లియర్ చెప్పను, ఇండ్ల మీద చిన్నపిల్లలు మహిళల మీద దాడి చేయడం తప్పు, మా పార్టీ కార్యకర్తలు ఆలా చేసిన చర్యలు తీసుకుంటా అని చెప్పపారు. రాజకీయాలకు కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. మీకు చేతనైతే సంబంధిత నాయకులపై కొట్లాడండి విమర్శలు ప్రతి విమర్శలు చేయండికానీ, బలుపెక్కి బాగా తాగి, డ్రగ్స్ తీసుకొని కుటుంబం జోలికి వెళ్లొద్దు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చేతగాని దద్దమ్మలు బీఆర్ఎస్ నాయకులు : బండి సంజయ్

ఃరాజకీయంగా కొట్లాడడం చేతగాని బీఆర్ఎస్ నాయకులు నా దృష్టిలో దద్దమ్మలు. చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులపై దాడి చేయడం పిరికి చర్యగా భావిస్తున్నాను. మీ నాయకుడు ఏందో మద్యం, డ్రగ్స్ ఇచ్చి ఇంటిపైకి వెళ్లి దాడి చేయమంటే చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా..? పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరు..? రాజకీయాలతో పిల్లలకు ఏంటి సంబంధం. దాడి చేసిన వారు చేయించినవారు ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి. మీకు మానవత్వం ఉంటే నా మాటలు విని మీలో మార్పు వస్తుందని భావిస్తున్నాను.

ఇప్పుడే వెళ్లి చిన్న పిల్లలపై దాడి చేయమన్న వాడి గల్ల పట్టి అడగండి. మా అంటే మీరు అధికారంలో ఉండేది కేవలం మూడు నెలలు మాత్రమే. నువ్వు సత్తే పురుషుడీవే అయితే ఆరోపణకు ప్రత్యారోపణ చేయాలి. అప్పుడు ఎవరి ఆరోపణలో నిజం ఉందో ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరు భూ కబ్జాలకు పాల్పడుతున్నారో ప్రజలకు తెలియదా..? ఇండ్ల మీద దాడి చేసే సాంప్రదాయం ఏంటి కొంచమైనా సిగ్గు ఉండాలి అని తాండూర్ బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలను కాపాడా లేని వాడు పోలీస్ అధికారి కాదు : బండి సంజయ్

బీఆర్ఎస్ నాయకులు అధికారం ఉందని కండకావరంతో బలుపెక్కి దాడులు చేస్తుంటే, జిల్లా పోలీస్ యంత్రాంగం వారికీ బానిసలుగా చేతులు కట్టుకొని కూర్చోవడం సిగ్గుచేటు. దాడి జరుగుతుంది అని ముందే తెలిసిన పోలీసులు వారి కంటే ముందే సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ వారిని ఎందుకు అక్కడికి రాకుండా నియంత్రించలేకపోయారు. పైగా మాపై కూడా దాడి చేశారు అని చెప్పుకుంటున్న పోలీసులు, మీపై దాడి చేస్తే 353 నాన్ బేలబుల్ కేసు పెట్టాలి కదా..? ఎందుకు పెట్టలేదు.

పోలీసులను కొట్టే స్థాయికి బిఆర్ఎస్ నాయకులు వస్తే, పడే స్థాయిలో పోలీసులు ఉంటే చట్టాన్ని కాపాడేది ఎవరు..? ఇక్కడి పోలీసులు చేతగానివాళ్లు. తాండూర్ పోలీసులకు డ్యూటీ చేసే అర్హత లేదు. ఇప్పుడే వెళ్లి ఇంట్లో కూర్చోవాలి. ప్రజలను కాపాడా లేని వాడు పోలీస్ అధికారి కాడు. జిల్లాలో చేతకాని పోలీస్ శాఖ ఉందని జిల్లా పోలీస్ యంత్రాంగంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి, మురళీకృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులు, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story