జిల్లా ఉత్తమ జీపీగా చాపలగూడెం

by Dishanational1 |
జిల్లా ఉత్తమ జీపీగా చాపలగూడెం
X

దిశ, కుల్కచర్ల: గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులో భాగంగా జాతీయస్థాయి అవార్డులలో జిల్లాస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు అందుకోవడం జరిగిందని చాపల గూడెం సర్పంచ్ గండి లక్ష్మయ్య అన్నారు. శనివారం డీ పీ ఆర్ ఓ కార్యాలయంలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు చాపలగూడెం గ్రామ సర్పంచ్ గండి లక్ష్మయ్య అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీపీ సత్తెమ్మ, జడ్పీటీసీ రాందాస్ నాయక్, ఎంపీఓ కరీం, ఎంపీడీవో నాగవేణి పాల్గొన్నారు.



Next Story

Most Viewed